Home / Latest News  / టీఎస్ వ్యాలెట్‌ను ప్రజల్లోకి తీసుకొస్తాం : సీఎం

టీఎస్ వ్యాలెట్‌ను ప్రజల్లోకి తీసుకొస్తాం : సీఎం

నోట్ల రద్దుపై శాసనమండలిలో ముఖ్యమంత్రి కేసీఆర్ చర్చ ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు. దేశ ప్రయోజనాల కోసం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని తెలంగాణ ప్రభుత్వం మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రజల సాధక బాధకాలను ఎప్పటికప్పుడు కేంద్రానికి, ఆర్బీఐకి తెలియజేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో నెలకొన్న

నోట్ల రద్దుపై శాసనమండలిలో ముఖ్యమంత్రి కేసీఆర్ చర్చ ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు. దేశ ప్రయోజనాల కోసం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని తెలంగాణ ప్రభుత్వం మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రజల సాధక బాధకాలను ఎప్పటికప్పుడు కేంద్రానికి, ఆర్బీఐకి తెలియజేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై ఇది వరకే ఆర్బీఐకి రెండు లేఖలు రాశామని గుర్తు చేశారు. రైతులు, దినసరి కూలీలు పడుతున్న ఇబ్బందులను ఎప్పటికప్పుడు కేంద్రానికి, ఆర్బీఐకి తెలియజేస్తున్నామని తెలిపారు. నగదు రహిత లావాదేవీల్లో తెలంగాణ మొదటిస్థానంలో నిలిచిందన్నారు. నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహిస్తున్నామన్నారు. త్వరలో టీఎస్ వ్యాలెట్‌ను ప్రజల్లోకి తీసుకొస్తామని చెప్పారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ గాడి తప్పకుండా అన్ని చర్యలు తీసుకున్నామని తెలిపారు.

సిద్దిపేట జిల్లాలోని ఇబ్రహీంపూర్ గ్రామం వందశాతం నగదు రహిత గ్రామంగా మారిందన్నారు. సిద్ధిపేట నియోజకవర్గాన్ని నగదు రహితంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ప్రతి జిల్లాల్లోని కొన్ని గ్రామాలను నగదు రహిత గ్రామాలుగా తయారు చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. నగదు రహిత లావాదేవీలపై విధానపరమైన నిర్ణయాల కోసం కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశామన్నారు. రాష్ర్టంలో నగదు రహిత లావాదేవీలు ఎక్కువగా జరిగేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ప్రకటించారు.

అవినీతి రహిత భారతాన్ని నిర్మించేందుకు సహకరిస్తామని పేర్కొన్నారు. అవినీతి, ఉగ్రవాదం, నల్లధనం నిర్మూలనకు పెద్ద నోట్లు రద్దు చేస్తున్నట్లు ప్రధాని మోదీ నవంబర్ 8న ప్రకటించారని గుర్తు చేశారు. దేశ ప్రయోజనాల కోసం కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని తెలంగాణ ప్రభుత్వం స్వాగతిస్తున్నదని సీఎం తెలిపారు. నల్లధనం నిర్మూలించే దిశగా ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపట్టాలని సూచించారు. ఆర్థిక వ్యవస్థ గాడితప్పకుండా తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకున్నామని తెలిపారు. నోట్ల రద్దు అనేది రాష్ర్ట పరిధిలోని అంశం కాదని స్పష్టం చేశారు. కేంద్రం తీసుకున్న పాలసీని విమర్శించే దిశగా చర్చ ఉండొద్దన్నారు.

నోట్ల రద్దు తర్వాత ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను కేంద్రం దృష్టికి తీసుకెళ్తున్నామని తెలిపారు. ప్రధానిని కలిసి చేపట్టాల్సిన పనులను సూచించామని చెప్పారు. ఆసరా పెన్షన్లు విషయంలో ఏర్పడుతున్న ఇబ్బందులను వివరించామన్నారు. రూ. 500, 100 నోట్లు పంపాలని ఆర్బీఐని కోరామని చెప్పారు. రూ. 5 వేల కోట్ల చిన్న నోట్లు కావాలని ఆర్బీఐకి లేఖ రాశామని గుర్తు చేశారు. ఇప్పటి వరకు రాష్ర్టానికి ఆర్బీఐ నుంచి రూ. 19,109 కోట్లు వచ్చాయని తెలిపారు. నోట్ల రద్దు నాటి నుంచి రూ. 57,479 కోట్లు బ్యాంకుల్లో జమ అయ్యాయని చెప్పారు. ఏటీఎంలలో నగదు కొరతపైన కూడా ఆర్బీఐకి తెలిపినట్లు సీఎం చెప్పారు.

dailyenewz.updates@gmail.com

Review overview
NO COMMENTS

POST A COMMENT