Home / Andhrapradesh  / భూకంపం, సునామి హెచ్చరిక ..

భూకంపం, సునామి హెచ్చరిక ..

చిలీలోని పోర్టో మాంట్‌లో భూకంపం సంభవించింది. దీంతో అక్కడ సునామీ హెచ్చరికలు జారీ చేశారు . యూర్టో మాంట్‌కు 221 కిలోమీటర్ల దూరంలో 7.7 తీవ్రతతో భూకంపం వచ్చినట్లు అధికారులు ప్రకటించారు . భూ ఉపరితలానికి 15 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంపం సంభవించిందని చెబుతున్నారు. దీని

చిలీలోని పోర్టో మాంట్‌లో భూకంపం సంభవించింది. దీంతో అక్కడ సునామీ హెచ్చరికలు జారీ చేశారు . యూర్టో మాంట్‌కు 221 కిలోమీటర్ల దూరంలో 7.7 తీవ్రతతో భూకంపం వచ్చినట్లు అధికారులు ప్రకటించారు . భూ ఉపరితలానికి 15 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంపం సంభవించిందని చెబుతున్నారు. దీని ఫలితంగా భూకంప కేంద్రానికి వెయ్యి కిలోమీటర్ల పరిధివరకు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. ఈ క్రమంలో ఆ ప్రాంత ప్రజలను ఎమర్జెన్సీ విభాగం అప్రమత్తం చేసింది. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది.
నెల్లూరు జిల్లాలో కూడా పలు ప్రాంతాల్లో సోమవారం తెల్లవారుజామున భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. వింజమూరు, వరికుంటపాడు మండలాల్లో పెద్ద శబ్ధం రావడంతో ప్రకంపనలు సంభవించినట్లు స్థానికులు తెలియజేశారు . వింజమూరు మండలంలోని చాగలకొండ, బత్తినవారిపల్లె, ఊటుకూరు, గుండెమడకల, వెంకటాద్రిపాలెంలో 3 సెకన్ల పాటు భూమి కంపించింది. భూమి కంపించిన సమయంలో స్థానికులు భయాందోళనతో తమ నివాసాల నుంచి బయటకు పరుగులు తీశారు.

dailyenewz.updates@gmail.com

Review overview
NO COMMENTS

POST A COMMENT