నీ తల్లి సెషన్స్ గురించి నీకు బాగా తెలుసు అనుకుంటా అంటూ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు హల్చల్ చేస్తున్నా;యి . ఎప్పుడు నీతి వ్యాఖ్యాలు చెప్పే నీవు ఇలా కామెంట్ చేయడం ఏంటి అని అటు నెటిజనుల తో పాటు , సినెమా పరిశ్రమ తమ ఆగ్రహాన్ని వెలుబుచ్చుతోంది .
అశ్లీలంగా ఉన్నావంటూ అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్‌ను ట్రోల్ చేసిన ఓ నెటిజన్ వ్యవహారం సోషల్ మీడియాలో మరింత ముదురుతున్నది. ట్రోల్ చేసిన నెటిజన్ను ఉద్దేశించి రకుల్ చేసిన వ్యాఖ్యలు మీడియాలో వివాదంగా మారుతున్నది. సోషల్ మీడియాలో రకుల్ తీరును తప్పుపడుతున్నారు. ఇంతకీ రకుల్‌ను ఏమని ట్రోల్ చేస్తున్నారంటే..
కారులో సెషన్స్ గురించి కురచ దస్తులతో రకుల్ ప్రీత్ సింగ్ కారులో నుంచి దిగిన ఫొటోలను ట్వీట్టర్లో కనిపించగా.. ఓ నెటిజన్ తీవ్రంగా స్పందించాడు. కారులో సెషన్ నడిచిన తర్వాత ప్యాంటు వేసుకోవడం రకుల్ మరిచినట్టుంది అని కామెంట్ చేశాడు. దానిపై స్పందిస్తూ కారులో మీ అమ్మకు చాలా సెషన్స్ జరిగిన అనుభవం ఉన్నట్టు ఉంది. అందుకే అంత కచ్చితంగా చెప్పావు అని రకుల్ ఘాటుగా రిప్లై ఇచ్చింది. రకుల్ నీవు కూడా దిగజారావు రకుల్ ప్రీత్ సింగ్ ప్రవర్తించిన తీరుపై ఓ నెటిజన్ స్పందించారు. వాస్తవానికి నెటిజన్ కంటే దిగజారి కామెంట్ చేశాడు. అతనికంటే నీవేమి తక్కువ కాదు. తల్లి ఎవరికైనా తల్లే. ఒకవేళ రావణుడు లాంటి వాడికి జన్మనిచ్చినా ఆమె తల్లే అవుతుంది. ఫెమినిజం మీద నీవు ఇచ్చే బోధనలకు అర్ధం లేకుండా పోయాయి అని ఓ నెటిజన్ ఆవేదన వ్యక్తం చేశాడు. తల్లిని లాగి తప్పు చేశావు నిన్ను దూషించిన ఓ వ్యక్తి తల్లిని ఈ వివాదంలోకి లాగి మరింత సమస్యలోకి కూరుకుపోయావు. నిన్ను చూసి సిగ్గుతో తలవంచుకొంటున్నాను. నీలాంటి వాళ్లు తెలుగు సినిమా పరిశ్రమలో ఉన్నందుకు సిగ్గుపడుతున్నాను అని ఘాటైన పోస్టుతో నెటిజన్ స్పందించాడు. విలువలపై స్పందించే వాళ్లు తనపై వస్తున్న ట్రోల్స్ గురించి ట్విట్టర్లో రకుల్ ప్రీత్ సింగ్ అంతే ఘాటుగా స్పందిస్తున్నారు. మాటకు మాట జవాబుగా ఇస్తూ తీవ్రంగా స్పందిస్తున్నారు. నా విలువలను గురించి ప్రశ్నించే వారు.. మహిళలపై జరుగుతున్న దాడులపై ఎందుకు స్పందించరు. అతడికి ఎలాగైతే ఫ్యామిలీ ఉందో నాకు అలానే కుటుంబం ఉంది. అతడు చేసిన పనికి ఆయన తల్లే చెంపలు పగలకొడుతుంది అని రకుల్ ప్రీత్ ఘాటుగా స్పందించింది. చెంపలు వాయించాలి రకుల్ చేసిన కామెంట్లకు మరో నెటిజన్ దారుణంగా పంచ్ వదిలాడు. ముందు మీ అమ్మ నీ చెంపలు వాయించాలి. ఎందుకంటే అంతా చెండాలంగా డ్రస్ వేసుకొని దేశమంతా తిరుగుతున్నావ్ కాబట్టి అని ఓ నెటిజన్ స్పందించాడు. ఇలాంటి కామెంట్లు, ప్రతి కామెంట్లతో సోషల్ మీడియా రచ్చరచ్చగా మారింది. దీనికి ఎక్కడ ముగింపు పలుకుతుందో వేచి చూడాల్సిందే.