Home / Latest News  / నోట్ల రద్దు వ్యవహారం భారీ కుంభకోణం

నోట్ల రద్దు వ్యవహారం భారీ కుంభకోణం

కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం అతి పెద్ద కుంభ కోణం అని కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం ఆరోపించారు ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ తీసుకున్న పెద్దనోట్ల రద్దు నిర్ణ‌యం 2016 సంవత్సరంలోనే అతిపెద్ద కుంభకోణమని కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం ఆరోపించారు. హైదరాబాద్‌లోని

కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం అతి పెద్ద కుంభ కోణం అని కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం ఆరోపించారు
ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ తీసుకున్న పెద్దనోట్ల రద్దు నిర్ణ‌యం 2016 సంవత్సరంలోనే అతిపెద్ద కుంభకోణమని కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం ఆరోపించారు. హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో జరిగిన తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన పాల్గొని కార్యకర్తలనుద్దేశించి ప్రసంగించారు. దేశంలో వంద శాతం నగదు రహిత లావాదేవీలు చేస్తామని ప్రధాని చెబుతున్న మాటలు బూటకమని, వందశాతం క్యాష్‌లెస్‌ లావాదేవీలు ప్రపంచంలో ఎక్కడా సాధ్యం కాలేదన్నారు. అభివృద్ధి చెందిన అమెరికా, యూరప్‌ దేశాల్లోనూ వందశాతం క్యాష్‌లెస్‌ లావాదేవీలు జరగడం లేదన్నారు. పెద్దనోట్ల రద్దు నిర్ణయంతో దేశ ప్రజలంతా ఎన్నో కష్టాలు, ఇబ్బందులు పడుతున్నారన్నారు. చిన్న వ్యాపారులు వ్యాపారం జరగక దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారని తెలిపారు. నరేద్ర మోడీ చెపుతున్న మాటలకు , వాస్తవాలకు ఎలాంటి సంబందాలు లేవని అన్నారు . అన్ని రకాలైన ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన చెప్పారు .

div>

మీకు నచ్చితే లైక్ చేయండి .     లేదా షేర్  చేయండి

dailyenewz.updates@gmail.com

Review overview
NO COMMENTS

POST A COMMENT