Home / Hot Hot  / కవన వనం లో సరికొత్త పరిమళం – మన కొత్త శ్రీనివాస్

కవన వనం లో సరికొత్త పరిమళం – మన కొత్త శ్రీనివాస్

జీవితం లో కేవలం డబ్బు సంపాదనే ధ్యేయంగా నిత్యం శ్రమ పడే వాళ్ళు చాలా మంది ఉంటారు . కాని అందుకు విరుద్దంగా , ఎంతో మందిని తన ప్రయత్నం తో మార్పునకు గురిచేస్తూ ముందుకెలుతున్న వ్యక్తి మన కొత్త శ్రీనివాస్, తన ఇంటి పేరుకు


జీవితం లో కేవలం డబ్బు సంపాదనే ధ్యేయంగా నిత్యం శ్రమ పడే వాళ్ళు చాలా మంది ఉంటారు . కాని అందుకు విరుద్దంగా , ఎంతో మందిని తన ప్రయత్నం తో మార్పునకు గురిచేస్తూ ముందుకెలుతున్న వ్యక్తి మన కొత్త శ్రీనివాస్, తన ఇంటి పేరుకు తగినట్లుగానే కొత్త తరహాలో కవిత్వం చెపుతూ , ఎంతో మంది పరివర్తనకు కారణమవుతున్న మన కొత్త శ్రీనివాస్ సరికొత్త ఆవిష్కరణ “భావ చిత్రాలు _ జీవిత సత్యాలు ” అను పేరిట క్యాలండర్ కవిత్వం పేరిట ఓ సంపుటి ఆదివారం నాడు హైదెరాబాద్ లోని ఫిలిం క్లబ్ లో ఆవిష్కరణ జరిగింది .

అయితే ఇప్పటి వరకు సాహిత్యం లో ఉన్న అనేక రూపాల్లో కి భిన్నమైన ప్రక్రియలో శ్రీనివాస్ తన కవిత్యాన్ని పరిచయం చేయడం ఇక్కడ అందరి మన్ననలకు చూరగొన్నది . క్యాలండర్ కవిత్యం పేరిట రూపొందించి ఆవిష్కరించిన శ్రీనివాస్ సాహిత్యం కచ్చితంగా ఇదో మంచి ఒరవడి అని కార్యక్రమానికి హాజరైన ప్రముఖులు విశ్లేషించడం ఇక్కడ ప్రధాన అంశం .

ఈ కార్యక్రమానికి తెలుగు సినిమా మాటల రచయిత పరుచూరి బ్రదర్స్, సినిమా దర్శకుడు బి. గోపాల్ , తదితర ప్రముఖులు హాజరయ్యాడు . ఈ కార్యక్రమం లో పరుచూరి గోపాల కృష్ణ మాట్లాడుతూ గతం లో గ్రంథాలు పుస్తక రూపకం లో ఉండేది . కాని ప్రస్తుతం ట్విట్టర్ సాహిత్యం , పేస్ బుక్ సాహిత్యం తదితర రూపాల్లో సాహిత్యం వస్తుందని అన్నారు . అయితే ఈ క్యాలెండర్ కవిత్యం మాత్రం మనకు ఉదయాన్నే దర్శనమిచ్చి ఆ రోజు ముగిసే వరకు చైతన్యాన్ని నింపడం దీని ప్రత్యేకత అని అన్నారు .

మనుషులు తమ మధ్య గోడ కట్టుకోవద్దని అది విభజనకు నిదర్శనమని అన్నారు . అయితే వంతెనలు నిర్మించుకోవాలని ఆయన సూచించారు . ఎందుకంటే వంతెనలు ఇరు ప్రదేశాలను ఒక్కటి చేస్తుందని ఆయన వివరించారు . ఇలాంటి గొప్ప ప్రయత్నం తో సాహిత్యం లోకి అడుగు పెట్టిన కొత్త శ్రీనివాస్ ను మనస్పూర్తిగా అభినందిస్తూ , మరింత ఇలాంటి మంచి సాహిత్యాన్ని ప్రజలకు అందజేయాలని ఆకాశిస్తూ శ్రీనివాస్ ను ఆశీర్వదించారు . పరుచూరి బ్రదర్ వెంకటేశ్వర్ రావు మాట్లాడుతూ శ్రీనివాస్ పాత పడిపోయినా , కొత్తగా కొత్త శ్రీనివాస్ కవిత్వం విలసిల్లాలని ఆకాక్షించారు .వ్యక్తిత్వ వికాస నిపుణుడు ఆకెళ్ళ రాఘవ రావు మాట్లాడుతూ మనిషి కింద పడిపోయి లేవలేని పరిస్థితులో ఉన్నప్పుడు , ఖచ్చితంగా అక్షరం మాత్రమె మనలను తట్టిలేపి నిలబెడుతుందని అన్నారు . ఈ కార్య క్రమమలో రచయిత కొత్త శ్రీనివాస్ మాట్లాడుతూ తన భార్య ప్రోత్సాహం తో ఈ క్యాలండర్ కవితా సంపుటిని ఈ రోజు ప్రజల ముందుకు తెగలిగానని అన్నారు

మీకు నచ్చితే లైక్ చేయండి .     లేదా షేర్  చేయండి

dailyenewz.updates@gmail.com

Review overview
NO COMMENTS

POST A COMMENT