Home / Latest News  / కేజ్రివాల్ ఫై కేసు నమోదుకుఈసీ ఆదేశం

కేజ్రివాల్ ఫై కేసు నమోదుకుఈసీ ఆదేశం

న్యూఢిల్లీ: ధిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీ వాల్ పై కేసు నమోదు అయింది . గతం లో ఏసీ చేసిన హెచ్చరికలను బేఖాతరు చేయడంతో ఆగ్రహించిన ఈసీ కేజ్రీ వాల్ పై కేసు నమోదు కు ఆదేశించింది . 40 అసెంబ్లీ స్థానాలున్న


న్యూఢిల్లీ: ధిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీ వాల్ పై కేసు నమోదు అయింది . గతం లో ఏసీ చేసిన హెచ్చరికలను బేఖాతరు చేయడంతో ఆగ్రహించిన ఈసీ కేజ్రీ వాల్ పై కేసు నమోదు కు ఆదేశించింది . 40 అసెంబ్లీ స్థానాలున్న గోవా రాష్ట్రంలో ఫిబ్రవరి 4న ఎన్నికలు జరగనున్నాయి. పోలింగ్‌ తేదీ సమీపించిన తరుణంలో కేంద్ర ఎన్నికలసంఘం సంచలన నిర్ణయం తీసుకుంది.ఆమ్‌ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ ఫై కేసు నమోదుచేసి ప్రాధమికసమాచార నివేదిక ప్రతిని రెండురోజుల్లో తనకు సమర్పించాలని ఆదేశించింది.ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లఘించడమేకాక, గతంలోతాము చేసిన హెచ్చరికలను సైతం ఖాతరుచేయని ఆయనపై ఈసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.ప్రత్యర్థి పార్టీలు డబ్బులిస్తే తీసుకోండి.. ఓటు మాత్రం ఆమ్‌ ఆద్మీ పార్టీకే వెయ్యండి…అంటూ ఈనెల8న గోవాఎన్నికల సభలో వోటర్లకు ఆయన పిలుపు నిచ్చిన విషయం విధితమే.దీనిఫై కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది.దీనిఫై వివరణ ఇవ్వాల్సిందిగా ఎన్నికల సంఘం నోటీసులు జారీచేసింది.ఈ నోటీసులకు సమాధానం ఇవ్వాల్సిన కేజ్రివాల్ ఆ పని చేయకుండా కోర్టును ఆశ్రయించారు. ఫైగాఎన్నికల సంఘాన్ని నోటిసుల విషయంలో తప్పు పట్టారు. కేజ్రివాల్ వైఖరిని గర్హిస్తూ ఈనెల 21న ఈసీ ఒక ప్రకటన చేసింది.ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పదేపదే ఉల్లంఘిస్తే కఠిన చర్యలకు వెనుకాడబోమనిఒకదశలో ఈ సి హెచ్చరించింది. అయినా కేజ్రీవాల్‌ దిగిరాకపోవడంతో చట్టపరమైన చర్యలకు ఆదివారం అదేశాలు జారీచేసింది.

మీకు నచ్చితే లైక్ చేయండి .     లేదా షేర్  చేయండి

dailyenewz.updates@gmail.com

Review overview
NO COMMENTS

POST A COMMENT