Home / Cinema_01  / చిరు ఇక రాజకీయాలనుంచి – సినిమాల వైపునకు …

చిరు ఇక రాజకీయాలనుంచి – సినిమాల వైపునకు …

చిరు రాజకీయాలను పక్కనపెట్టారు. ఇక ప్రధమ ప్రాధాన్యతను సినిమాలకే ఇవ్వాలని అనుకుంటున్నట్లు కనిపిస్తోంది . ఇటీవల చిరంజీవి 150వ సినిమా విజయం తర్వాత , ఉత్సాహంగా ఉన్న చిరు ఇక సినిమాల పై ఎక్కువ శ్రద్ధ వహించడానికి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే వెంటనే


చిరు రాజకీయాలను పక్కనపెట్టారు. ఇక ప్రధమ ప్రాధాన్యతను సినిమాలకే ఇవ్వాలని అనుకుంటున్నట్లు కనిపిస్తోంది . ఇటీవల చిరంజీవి 150వ సినిమా విజయం తర్వాత , ఉత్సాహంగా ఉన్న చిరు ఇక సినిమాల పై ఎక్కువ శ్రద్ధ వహించడానికి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే వెంటనే 151 వ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం , ఆ సినిమాకు దర్కుడి పేరుకు కూడా ఫైనల్ చేయడం ఈ విషయాన్ని భాలపరుస్తున్నాయి .తొమ్మిదేళ్ల విరామం అనంతరం 150వ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్‌ చిరంజీవి నటించిన ‘ఖైదీ నంబర్ 150’ సంక్రాంతికి విడుదలై భారీ కలెక్షన్లతో దూసుకుపోతోంది. ఈ సినిమాతో మళ్లీ మెగాస్టార్ తన క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని నిరూపించాడు. పది రోజుల్లో 100 కోట్ల మార్కెట్‌ను క్రాస్ చేశాక జోరు మీదున్న చిరు ఇపుడు తన 151వ చిత్రానికి సన్నాహాలు మొదలుపెట్టాడు. ఆయన కొత్త చిత్రానికి సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహించనున్నారు. రామ్‌చరణ్‌తో ధృవ చిత్రాన్ని రూపొందించి ఘన విజయాన్ని అందుకున్న సురేందర్‌రెడ్డి ఇప్పుడు చిరంజీవి కోసం కథను సిద్ధం చేశాడు. ఈ చిత్రానికి పరుచూరి బ్రదర్స్ రచనా సహకారం అందిస్తున్నారట. మాస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందే ఈ సినిమా వచ్చే నెలలో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. ఈ చిత్రాన్ని కూడా మెగా తనయుడు రామ్‌చరణ్ నిర్మిస్తుండడం విశేషం. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక వివరాలు వెలువడనున్నాయి.

dailyenewz.updates@gmail.com

Review overview
NO COMMENTS

POST A COMMENT