Home / Latest News  / భారీ అలంకరణలతో బుర్జ్‌ ఖలీఫా – గణతంత్ర ఏర్పాట్లు అద్భుతం

భారీ అలంకరణలతో బుర్జ్‌ ఖలీఫా – గణతంత్ర ఏర్పాట్లు అద్భుతం

దుబాయ్ లో 68వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి . ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భ‌వ‌నం దుబాయ్‌లోని బుర్జ్‌ ఖలీఫా అనే భవనం ఉంది . ఈ భవనాన్ని మువ్వ‌న్నెల‌ విద్యుద్దీపాలతో అలంకరించారు. బుధవారం అర్ధరాత్రి నుంచి ఈ భవనం భారత త్రివర్ణ

దుబాయ్ లో 68వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి .
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భ‌వ‌నం దుబాయ్‌లోని బుర్జ్‌ ఖలీఫా అనే భవనం ఉంది . ఈ భవనాన్ని మువ్వ‌న్నెల‌ విద్యుద్దీపాలతో అలంకరించారు. బుధవారం అర్ధరాత్రి నుంచి ఈ భవనం భారత త్రివర్ణ పతాకం రంగులతో మెరిసిపోనుంది. ‘ఈ రోజు రాత్రి భారత 68వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోనున్నాం. ఈ సందర్భంగా భారత జాతీయ పతాకం తరహాలోనే బుర్జ్‌ ఖలీఫా భవనం మొత్తాన్ని ఎల్‌ఈడీ దీపాలతో అలంకరించి మెరిసేలా ఏర్పాట్లు చేసినట్లు’ బుర్జ్‌ఖలీఫా అధికారిక ట్విట్టర్‌లో నిర్వాహకులు తెలిపారు. దుబాయ్‌లో ఉన్న ఈ భవనం 823 మీటర్ల ఎత్తుంది. అబుదాబి పాలకుడు, యూఏఈ అధ్యక్షుడు ఖలీఫా బిన్‌ జయేద్‌ అల్‌ నహ్యాన్‌ గౌరవార్థం ఈ భవనాన్ని నిర్మించారు. ఈ ఏడాది గణతంత్ర దినోత్సవాల ముఖ్య అతిథిగా అబుదాబి యువరాజు షేక్‌ మహమ్మద్‌ బిన్‌ జయేద్‌ అల్‌ నహ్యాన్‌ హాజరుకానున్నారు. ఇప్ప‌టికే ఆయ‌న ఇండియా చేరుకున్నారు. భారీ అలంకరణతో ప్రజలను ఆకర్షించే రీతిలో ఉండే ఈ ఏర్పాట్లు చేయడం అభినందనీయం .

dailyenewz.updates@gmail.com

Review overview
NO COMMENTS

POST A COMMENT