Home / Cinema_5  / తాప్సీ కి ఆశ ఎక్కువ – ఆగకుండ గంతులెక్కువ

తాప్సీ కి ఆశ ఎక్కువ – ఆగకుండ గంతులెక్కువ

కథానాయిక తాప్సీ తను కన్న కళలను నేరవేర్చుకుంటుందని తెగ సంబరపడిపోతోంది . ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రెండు కళలను తీర్చుకోబోతుందని ఉబ్బితబ్బిబ్బవుతోంది . కాని తన

కథానాయిక తాప్సీ తను కన్న కళలను నేరవేర్చుకుంటుందని తెగ సంబరపడిపోతోంది . ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రెండు కళలను తీర్చుకోబోతుందని ఉబ్బితబ్బిబ్బవుతోంది . కాని తన కల ఎప్పటికి తీరుతుందో నని మరో పక్క నీరసపడిపోతోంది. ఏ ఆర్టిస్ట్‌కైనా ఫలానా దర్శకుడితో సినిమా చేయాలనే కల ఉంటుంది. కొంతమందికి ఆ కల నెరవేరుతుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా కొంతమందికి నెరవేరదు.sexy-tapsy తాప్సీకి ఒకటి కాదు.. ఏకంగా రెండు కలలు ఉన్నాయి. దక్షిణాది పరిశ్రమ గర్వించదగ్గ దర్శకునిగా పేరు తెచ్చుకున్న మణిరత్నం దర్శకత్వంలో ఏ ఆర్టిస్ట్ అయినా కనీసం ఒక్క సినిమాలో నటించే అవకాశం వచ్చినా చాలనుకుంటారు. తాప్సీకి కూడా ఆ కోరిక ఉంది. ‘‘మణిరత్నం దర్శకత్వం వహించే చిత్రాలకు నేను పెద్ద ఫ్యాన్‌ని. ఆయన సినిమాలో నటించాలన్నది నా ఆశయం. మణిరత్నం ఏ భాషలో సినిమా చేస్తున్నారన్నది నాకు ముఖ్యం కాదు. ఆ భాషలో నాకు అవకాశం ఇస్తే నేను కచ్చితంగా కాదనను. ఏదో ఒక రోజు ఆయన అవకాశం ఇస్తారని నమ్ముతున్నాను’’ అని తాప్సీ పేర్కొన్నారు. హిందీ నటుడు హృతిక్ రోషన్ సరసన జత కట్టాలన్నది తాప్సీ మరో కోరిక. ‘‘ఒకవేళ హృతిక్ సరసన సినిమా చేసే అవకాశం వస్తే, అప్పుడు కళ్లు తిరిగి కింద పడిపోతానేమో’’ అని తాప్సీ అన్నారు.

dailyenewz.updates@gmail.com

Review overview
NO COMMENTS

POST A COMMENT