Home / Jobs  / భారీ స్థాయిలో ప్రభుత్వ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్

భారీ స్థాయిలో ప్రభుత్వ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్

తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం భారీ స్థాయిలో ఉద్యోగాలను భర్తీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది . నిరుద్యోగ యువకులకు ఈ అవకాశం సంతోషాన్ని కలిగిస్తోంది .తెలంగాణా రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటుచేయ‌నున్న‌ 130 మైనార్టీ గురుకుల పాఠశాలలకు ఉద్యోగాలను మంజూరుచేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేష‌న్ జారీచేసింది. 4,137 రెగ్యులర్‌


తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం భారీ స్థాయిలో ఉద్యోగాలను భర్తీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది . నిరుద్యోగ యువకులకు ఈ అవకాశం సంతోషాన్ని కలిగిస్తోంది .తెలంగాణా రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటుచేయ‌నున్న‌ 130 మైనార్టీ గురుకుల పాఠశాలలకు ఉద్యోగాలను మంజూరుచేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేష‌న్ జారీచేసింది. 4,137 రెగ్యులర్‌ పోస్టులు, 692 ఔట్ సోర్సింగ్ పోస్టులను మంజూరుచేసింది. ప్రిన్సిపల్స్‌ 118, జూనియర్‌ లెక్చరర్లు 1110, పీజీటీలు 1140, టీజీటీలు 1010, పీఈటీలు 124, పీడీలు 130, లైబ్రేరియన్‌లు 130, స్టాఫ్‌నర్స్‌ 125, క్రాఫ్ట్‌, ఆర్ట్‌, మ్యూజిక్‌ ఇన్‌స్ట్రక్టర్‌లు 125, సీనియర్‌ అసిస్టెంట్లు 125 చొప్పున ఉద్యోగాలను మంజూరు చేస్తున్నట్టు ప్రకటించింది. మూడు విద్యా సంవత్సరాల్లో 4137 రెగ్యులర్‌ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనుంది. 2017- 18 సంవత్సరంలో 1273 రెగ్యులర్‌ పోస్టులు, 2018-19లో 1494 పోస్టులు, 2019-20లో 1370 రెగ్యులర్‌ పోస్టులను భర్తీ చేయనుంది.
మైనార్టీ గురుకులాల్లో కూడా …
మైనార్టీ గురుకులాల్లో 1638 ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి కూడా ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఈ ఉద్యోగాలను పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ద్వారా భర్తీ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ పోటీల్లో ప్రిన్సిపల్‌ 118, పీజీటీ 280, టీజీటీ 866, పీఈటీ 124, ఆర్ట్‌, క్రాప్ట్‌, మ్యూజిక్‌ టీచర్లు 125, స్టాఫ్‌నర్సు ఉద్యోగాలను భర్తీచేసేందుకు ప్రభుత్వం అంగీకారం తెలుపుతూ ఉత్తర్వులు జారీచేసింది.

మీకు నచ్చితే లైక్ చేయండి .     లేదా షేర్  చేయండి

dailyenewz.updates@gmail.com

Review overview
NO COMMENTS

POST A COMMENT