Home / Latest News  / జల్లికట్టుపై ఇరు ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవాలి , అసదొద్దీన్ వ్యాఖ్యలు

జల్లికట్టుపై ఇరు ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవాలి , అసదొద్దీన్ వ్యాఖ్యలు

హైదరాబాద్‌:తమిళ నాడులో  జల్లు కట్టు వివాదం కొనసాగుతోంది . అయితే సుప్రీం కోర్టు మాత్రం  జల్లికట్టు  వివాదం పై  తీర్పును  వాయిదా వేసింది.  సమస్యను  పరిస్కరించుకునేందుకు  కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు  ఒక నిర్ణయానికి రావాలని సూచించింది . కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు ‘జల్లికట్టు’పై తీర్పును

హైదరాబాద్‌:తమిళ నాడులో  జల్లు కట్టు వివాదం కొనసాగుతోంది . అయితే సుప్రీం కోర్టు మాత్రం  జల్లికట్టు  వివాదం పై  తీర్పును  వాయిదా వేసింది.  సమస్యను  పరిస్కరించుకునేందుకు  కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు  ఒక నిర్ణయానికి రావాలని సూచించింది . కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు ‘జల్లికట్టు’పై తీర్పును సుప్రీంకోర్టు వాయిదా వేసింది. తమిళనాడులో శాంతి భద్రతలు అదుపులో లేవంటూ ఆందోళన వ్యక్తం చేసింది కేంద్రం. ఈ విషయంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్చించుకుని ఓ నిర్ణయానికి రావాలని సుప్రీం సూచించింది. అదలా ఉంటే తమిళనాడు జల్లికట్టుపై నిషేధం ఎత్తివేయాలంటూ నిరసనలు కొనసాగుతున్నాయి.తమిళనాడులో జల్లికట్టు ఆందోళనలుపతాక స్థాయికి చేరుకున్నాయి cialis prices.

ప్రజల సంపూర్ణ మద్దతు

జల్లికట్టునిర్వహణకుఅనుమతించాలంటూ విద్యార్ధి, వ్యాపార, వాణిజ్య సంఘాలు శుక్రవారం రాష్ట్రవ్యాప్త బంద్ పాటిస్తున్నాయి.రాజకీయ పార్టీలన్నీ బంద్ కు మద్దతు ప్రకటించాయి.

అసదుద్దీన్ ఒవైసీ వివాదాస్పద వ్యాఖ్యలు

ఎంఐఎం ఎపీ అసదుద్దీన్ ఒవైసీ జల్లికట్టు ఉద్యమంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఉమ్మడి పౌరస్మృతి కుదరనిపని అని అయన ట్వీట్ చేశారు. దేశంలో వైరుధ్యాలు ఉన్నాయని చెప్పేందుకు జల్లికట్టుపై తమిళనాడులో జరుగుతున్న ఉద్యమమే నిదర్శనమని ఒవైసీ అన్నారు. భిన్నత్వంలో ఏకత్వం భారతదేశ గొప్పతనమని, రకరకాల జాతులు, మతాలకు చెందినవారు తమతమ సంప్రదాయాలు పాటిస్తారని, అయితే ఈ స్ఫూర్తికి భిన్నంగా హిందుత్వ శక్తులు ఉమ్మడి పౌరస్మృతిని తేవాలని ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు.జల్లికట్టును, దానిని పాటించే తమిళ ప్రజలను పరిగణలోకి తీసుకోకుండా చట్టాలు అమలుచేసినట్లే.. ముస్లింల జీవనవిధానంపైనా బలవంతపు చట్టాలు రుద్దుతున్నారని, ఇలాంటి చర్యలు దేశానికి మంచివి కావని ఒవైసీ వ్యాఖ్యానించారు.

 

 

dailyenewz.updates@gmail.com

Review overview
NO COMMENTS

POST A COMMENT