Home / Cinema_01  / ‘కపిల్ శర్మ- షో’ లో కంగనా రనౌత్ పడి,పడి నవ్వింది… ఎందుకు ?

‘కపిల్ శర్మ- షో’ లో కంగనా రనౌత్ పడి,పడి నవ్వింది… ఎందుకు ?

రింగుల జుట్టు ముద్దుగుమ్మ , బాలీవుడ్ క్వీన్ 'కంగనా రనౌత్ ' (ప్రభాస్ మూవీ 'ఏక్ నిరంజన్' ఫేమ్ ) గుర్తుంది కదా ! తను షాహిద్ కపూర్ సరసన

రింగుల జుట్టు ముద్దుగుమ్మ , బాలీవుడ్ క్వీన్ ‘కంగనా రనౌత్ ‘ (ప్రభాస్ మూవీ ‘ఏక్ నిరంజన్’ ఫేమ్ ) గుర్తుంది కదా ! తను షాహిద్ కపూర్ సరసన నటించిన బాలీవుడ్ చిత్రం ‘రంగూన్ ‘ విడుదల సందర్భంగా , గత ఆదివారం సోనీ టీవీ పాపులర్ షో – ‘కపిల్ శర్మ షో ‘ కి షాహిద్ కపూర్ తో అటెండ్ అయింది !
ఈ షో లో , పార్టిసిపెంట్స్ చేసిన కామెడీకి , ‘ కంగనా ‘ పడి ,పడి నవ్వడమే కాదు ,.. కళ్ళు తిరిగి పడిపోయే పరిస్థితికి చేరిందంటే అతిశయోక్తి కాదు ! అంతలా నవ్వులు పూయించింది ఈ ఎపిసోడ్ !
ఎంట్రీ ఇస్తూనే కంగనా షో -సెట్టింగ్ చూసి , ” నాకు సెట్ బాగా నచ్చింది !” అనగానే, ,… వెంటనే సిద్దూజీ “నాకు ఆమె మాత్రమే నచ్చింది !” అన్నాడు. గ్యాలరీ లోని ప్రేక్షకులు గొల్లుమన్నారు !
రంగూన్ సినిమా కథ 1944 కాలం నాటిది . కపిల్ శర్మ సిద్ధుకి చెప్తూ –” సిద్దూజీ ! .. ‘రంగూన్’ సినిమా లో షాహిద్ కపూర్ -కంగనా ఇద్దరూ ఒకరి పెదాల్ని ఒకరు శుభ్రం చేసుకునే సీన్ (లిప్ లాక్)ఒకటి ఉంది ! అంటే , ,.. ‘స్వఛ్చ భారత్’ కార్యక్రమం 1944-నుంచే ఉందన్నమాట ! ” అనగానే షాహిద్ తో సహా అందరు గొల్లుమన్నారు . కంగనా సిగ్గు పడుతూ నవ్వాపుకోలేకపోయింది!
కపిల్ కంగనా ని “ఒకవేళ ఎవరైనా అబ్బాయి మీకు కన్ను కొడితే ఏంచేస్తారు ?” అని అడగ్గా ,.. కంగనా “చెవ్వి మెలివేస్తాను “అంది. “అదేంటి,చెంపదెబ్బ కొట్టరా?” అని అడగ్గా ,..కంగనా “కన్ను కొడితే ,చెంప కొట్టాల?” అని ప్రాస తో కౌంటర్ ఇఛ్చి ,పెద్దగా నవ్వింది .
“ఒకవేళ అబ్బాయి ఫ్లర్ట్ చేద్దామా అనడిగితే ?” అనగా,… “చేద్దాం అంటాను! –అబ్బాయి బాగుంటే !” అంది . తిరిగి, అందరు నవ్వుకున్నారు . వెంటనే కపిల్ సిగ్గుపడుతూ ,” షో నిర్వహించే ఒక అందమైన యువకుడు (అంటే తను ) అడిగితే?..” అనగానే విషయం అర్థమై కంగనా నవ్వుతుండగా , వెనువెంటనే సిద్దూజీ సిగ్గుపడుతూ , “ఒక మాజీ క్రికెటర్ ,.. ప్రస్తుతం షో జడ్జి గ చేస్తున్నాయన (అంటే తను ) అడిగితె ?” అనగానే కంగనా పగలబడి నవ్వుతూ , “మీవి మాటలేనా ?ఫ్లర్టింగ్ చేసేదేమన్న వుందా ?” అని మరిన్ని నవ్వులు పూయించింది .

తర్వాత , రాజేష్ అరోరా పాత్రలో వఛ్చిన కపిల్ శర్మని ‘ఎక్సపర్ట్ సీట్లో కూర్చోమని’ కోరగా ,… ” అవును నేను చాలా ఎక్సపర్ట్ ని ! మీ వంటింట్లో కుక్కర్ లో పప్పు ఉడుకుతోందనుకోండి ,నేను బయటినుంచి విజిల్ వేసానంటే సరి! పప్పు ఉడికినట్టే !” అనగానే , కంగనా పెద్దగా నవ్వింది ! కపిల్ –“మరి నేనూ – షాహిద్ అప్పట్లో స్వదేశీ ఆందోళన్ నడిపాము ” అనగానే, ఆడ గెటప్ లో వున్న చందన్ ” స్కూటరే నడపడం రాదు,.. ఆందోళన నడిపారా ?” అనగానే,.. కంగనా గొల్లుమంది !

” మీకు తెలుసో లేదో ,..నేను గైడ్ ని! ప్రపంచమంతా త్రిప్పుతా !” అని కపిల్ చెప్పగా , ఆడ గెటప్ చందన్ “అయితే, నన్ను కూడా తిప్పవా ? ” అని కోరగా,… “దానిదేముంది?” అని కూర్చున్న రివాల్వింగ్ సీటుని గిర్రున తిప్పుతాడు. కంగనా నవ్వాపుకోలేక ఏడ్చేసింది ! … తన చీర చాటు రహస్యంగా వున్నా టాటూ ని ఆడ గెటప్ చందన్ ఓపెన్ చేయగా ,. కపిల్ కల్పించుకొని ” దీనికన్నా ముందు .తేలు టాటూ ఉండేది ! ఒక రోజు దాన్ని నేను అదిలించా . అంతే,.. ఏడ దూరిందో, ఏమో ! ” అనగానే, ఇంక అక్కడ ఒక్కొక్కరి పరిస్థితి చూడాలి ! నవ్వలేక చచ్చారు . కంగనా పరిస్థితి అయితే వర్ణనాతీతం !!

గత ఆదివారం జరిగిన ఈ ఎపిసోడ్ ( ఎపిసోడ్:83, ఫిబ్రవరి -19) ,.. నవ్వులతో ఉక్కిరిబిక్కిరి చేసిందంటే అతిశయోక్తి కాదు !! చివరికి, సిద్దూజి గ్యాలరీ లోని ప్రేక్షకులతో సహా లేచి స్టాండింగ్ ఒవేషన్ కూడా ఇచ్చాడు ! మొత్తానికి రేపు విడుదల అవుతోన్న ‘ రంగూన్ ‘ సినిమాకి మంచి ప్రమోషనే దక్కింది ! బెస్టాఫ్ లక్ కంగనా & షాహిద్ !!

dailyenewz.updates@gmail.com

Review overview
NO COMMENTS

POST A COMMENT