Home / Andhrapradesh  / భూములన్ని తిరిగి ఇచ్చేస్తాం – జగన్

భూములన్ని తిరిగి ఇచ్చేస్తాం – జగన్

అమరావతి: ఎవరి భూములు  వారికి తిరిగి ఇచ్చేస్తామని వైఎస్ఆర్ సిపి అధ్యక్షుడు జగన్మోహనరెడ్డి  ప్రజలకు హామీ ఇచ్చారు .  ఇప్పటి వరకు ప్రజల వద్ద నుంచి  అక్రమంగా ప్రభుత్వం లాక్కుని  వారికి అన్యాయం  చేసిందని  ఆయన  ఆరోపించారు . తమపార్టీ అధికారం లోకి రాగానే రాజధానికోసం సేకరించిన దళితుల

అమరావతి: ఎవరి భూములు  వారికి తిరిగి ఇచ్చేస్తామని వైఎస్ఆర్ సిపి అధ్యక్షుడు జగన్మోహనరెడ్డి  ప్రజలకు హామీ ఇచ్చారు .  ఇప్పటి వరకు ప్రజల వద్ద నుంచి  అక్రమంగా ప్రభుత్వం లాక్కుని  వారికి అన్యాయం  చేసిందని  ఆయన  ఆరోపించారు . తమపార్టీ అధికారం లోకి రాగానే రాజధానికోసం సేకరించిన దళితుల లంకభూములు,అసైండ్ భూములు తిరిగిఇచేస్తామని వైఎస్ఆర్ సిపి అధ్యక్షుడు జగన్మోహనరెడ్డి ప్రకటించారు.శుక్రవారం రాజధాని ప్రాంతాల్లో పర్యటించిన ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబుఫై తీవ్ర స్తాయిలో విరుచుకు పడ్డారు.రాజధాని నిర్మాణంలో దళితులకు అన్యాయం జరిగిందన్నారు.

దళితులకు  అన్యాయం  జరిగితే ఊరుకోం

దళితులకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. రాజధాని కోసం ఇప్పటికే 48 వేల ఎకరాల భూమి సేకరించినా చంద్రబాబుకు భూదాహం తీరలేదన్నారు.సచివాలయ నిర్మాణం కోసం ఇప్పటివరకు ఒక్క ఇటుకను కూడా సమకూర్చింది లేదన్నారు.ల్యాండ్ పూలింగ్ పేరుతో 27 వేల ఎకరాలు తీసుకున్న ప్రభుత్వం కొందరికి ప్లాట్లు యిచ్చినా అవి ఎక్కడున్నాయో తెలియడం లేదన్నారు.చంద్రబాబు రైతుల భూములు లాక్కోవడానికి అవేమైనా ఆయన అత్తగారి సొమ్మా అంటూ సూటిగా ప్రశ్నిచారు.రాజధాని నిర్మాణంలో ఇసుక, ఇటుక, కాంట్రాక్టు ల్లో అంతా అవినీతి చోటు చేసుకుందన్నారు.

dailyenewz.updates@gmail.com

Review overview
NO COMMENTS

POST A COMMENT