Home / Cinema_01  / బాహుబలి తర్వాత అత్యధిక బడ్జెట్ మహేష్ మూవీ

బాహుబలి తర్వాత అత్యధిక బడ్జెట్ మహేష్ మూవీ

సూపర్ స్టార్ మహేష్ బాబు-తమిళ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ కాంబినేషన్లో రాబోతోన్న భారీ మూవీకి బడ్జెట్ బడ్జెట్ లెక్క తేలింది . నిర్మాత తో జరిపిన చర్చల అనంతరం ఈ సినిమా నిర్మాణం పై ఎంత మొత్తం లో ఖర్చు పెట్టాలనే దానిపై ఓ నిర్ణయానికి వచ్చారు .

సూపర్ స్టార్ మహేష్ బాబు-తమిళ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ కాంబినేషన్లో రాబోతోన్న భారీ మూవీకి బడ్జెట్ బడ్జెట్ లెక్క తేలింది . నిర్మాత తో జరిపిన చర్చల అనంతరం ఈ సినిమా నిర్మాణం పై ఎంత మొత్తం లో ఖర్చు పెట్టాలనే దానిపై ఓ నిర్ణయానికి వచ్చారు . మొదట్లో ఈ సినిమా నిర్మాణానికి దాదాపుగా 110 కోట్లకు పైగా అవుతుందని లెక్కించారు . అయితే ఈ సినిమా నిర్మాత ఎన్ వి ప్రసాద్ బడ్జెట్ విషయం లో సూచించిన సూచన మేరకు 90 కోటలో సినిమా పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం . Mahesh-babu-muragan
దీంతో ఈ సినిమా నిర్మాణానికి సంబందించిన కార్యక్రమాలను వేగవంతం చేయడం లో నిమగ్నమయ్యారు . అయితే ఏప్రిల్ 14 చెన్నై న్యూ ఇయర్ కావడంతో ఆ రోజున ఈ సినిమా షూటింగ్ కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు . ప్రస్తుతం మహేష్ బాబు బ్రహ్మోత్సవం చిత్రం షూటింగ్ లో బిజీ గా ఉన్నాడు . అయితే ఈ సినిమా షూటింగ్ పూర్తి కావస్తున్నందున తదుపరి చిత్రంగా మురగాన్ దర్శకత్వం లో రానున్న సినిమా పై ద్రుష్టి పెట్టనున్నాడు . అయితే అత్యధిక బడ్జెట్ సినిమా లిస్టు లో ఇప్పటి వరకు బాహుబలి నిలిచింది . ఈ సినిమా తర్వాతా రెండో స్థానం లో ఈ సినిమా నిలవనుంది . అయితే ఇంత భారీ బడ్జెట్ తో ప్లాన్ చేస్తున్న ఈ సినిమాలో కథానాయిక గా ఎవరిని తీసుకునే విష్యం లో ఇంకా సందిగ్దత నెలకొని ఉంది .

dailyenewz.updates@gmail.com

Review overview
NO COMMENTS

POST A COMMENT