Home / Crime  / పిండి కింద పారేసిందని కూతురు పై కిరోసిన్ పోసి నిప్పంటించిన తల్లి

పిండి కింద పారేసిందని కూతురు పై కిరోసిన్ పోసి నిప్పంటించిన తల్లి

షాద్ నగర్:దారుణమైన సంఘటన స్థానికంగా జరిగింది . గుండె అవిసేలా ఉన్న ఈ సంఘటన పలువురిని కంటి తడి పెట్టిస్తోంది .కన్న కూతురిని కంటికి రెప్పలా చూసుకోవాల్సిన తల్లే కిరాతకురాలిగా మారింది. చిన్నపిల్ల అని కూడా చూడకుండా కిరోసిన్ మీద పోసి నిప్పంటించింది.ఈ ఘటన


షాద్ నగర్:దారుణమైన సంఘటన స్థానికంగా జరిగింది . గుండె అవిసేలా ఉన్న ఈ సంఘటన పలువురిని కంటి తడి పెట్టిస్తోంది .కన్న కూతురిని కంటికి రెప్పలా చూసుకోవాల్సిన తల్లే కిరాతకురాలిగా మారింది. చిన్నపిల్ల అని కూడా చూడకుండా కిరోసిన్ మీద పోసి నిప్పంటించింది.ఈ ఘటన రంగారెడ్డి జిల్లా ఫరూఖ్ నగర్ మండలం చింతగూడ గ్రామంలో జరిగింది. చింతగూడకు చెందిన చెన్నయ్య, దొబ్బ స్వరూప దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు.రోజూ మాదిరిగానే రాత్రి రొట్టెలు చేసేందుకు పిండి తీసుకురమ్మని స్వరూప తన కూతురు రాధిక(10)ను షాపుకు పంపించింది . రాధిక పిండి తెస్తుండగా అనుకోకుండా కొంత పిండి కింద పడిపోయింది.ఇది తెలియగానే రాధిక తల్లి అగ్గి మీద గుగ్గిలమే అయింది. కూతుర్ని చితకబాదింది. అంతటితో ఊరుకోకుండా ఇంట్లోకి వెళ్ళి కిరోసిన్ తీసుకొచ్చి చిన్నపిల్ల అని కూడా చూసుకోకుండా రాధికపై పోసి నిప్పటించింది.
ఇది గమనించిన స్థానికులు పరుగుపరుగున వచ్చి మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. వెంటనే 108 అంబులెన్స్ కు కాల్ చేసి, తీవ్రంగా కాలిన గాయాలతో ఉన్న ఆ చిన్నారిని షాద్ నగర్ లోని ప్రభుత్వ ఆసుప్రతికి తరలించారు. కానీ రాధిక పరిస్థితి విషమంగా మారడంతో అక్కడ్నించి హైదరాబాద్ లోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

dailyenewz.updates@gmail.com

Review overview
NO COMMENTS

POST A COMMENT