Home / General  / ఇకనుంచి డిజిటల్ లావాదేవీలే – ఆర్బిఐ గవర్నర్ ఉర్జీత్ పటేల్

ఇకనుంచి డిజిటల్ లావాదేవీలే – ఆర్బిఐ గవర్నర్ ఉర్జీత్ పటేల్

ప్రజలను దిజిటల్ వ్యవస్థ వైపు నడిపేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని ఆర్బిఐ గవర్నర్ ఉర్జీత్ పటేల్ తెలిపారు . ఆన్‌లైన్‌ లావాదేవీలపై విధించే ఛార్జీలను తగ్గించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నామ‌ని రిజర్వు బ్యాంకు ఆఫ్‌ ఇండియా గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్ తెలిపారు. శుక్రవారం ప్రజా పద్దుల కమిటీ (పీఏసీ)

ప్రజలను దిజిటల్ వ్యవస్థ వైపు నడిపేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని ఆర్బిఐ గవర్నర్ ఉర్జీత్ పటేల్ తెలిపారు . ఆన్‌లైన్‌ లావాదేవీలపై విధించే ఛార్జీలను తగ్గించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నామ‌ని రిజర్వు బ్యాంకు ఆఫ్‌ ఇండియా గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్ తెలిపారు. శుక్రవారం ప్రజా పద్దుల కమిటీ (పీఏసీ) ఎదుట ఆయన హాజరయ్యారు. ప్రజలను డిజిటిల్‌ బ్యాంకింగ్‌ వ్యవస్థ వైపు అడుగులు వేయించేందుకు కృషి చేస్తామని పటేల్‌ చెప్పినట్లు పీఏసీ సభ్యుడొక‌రు తెలిపారు. నోట్ల ర‌ద్దు అంశంపై పీఏసీ సభ్యులు ఆర్‌బీఐ గవర్నర్‌కి పలు ప్రశ్నలు సంధించారు. త్వరలోనే నగదు కొరత సమస్యలు తీరి పరిస్థితి సాధారణ స్థితికి చేరుకుంటుందని ఉర్జిత్‌ పటేల్‌ పేర్కొన్నారు. పట్టణ ప్రాంతాల్లో పరిస్థితి సాధారణంగానే ఉందని, గ్రామీణ, మారుమూల ప్రాంతాలకు నగదు చేరే విధంగా చర్యలు తీసుకుంటామని పటేల్‌ వెల్లడించారు. అందుకు మరికొంత సమయం పడుతుందని గవర్నర్‌ తెలిపినట్లు సమాచారం.

dailyenewz.updates@gmail.com

Review overview
NO COMMENTS

POST A COMMENT