రెండు గంటల్లో రెండు మిలియన్లు _ పవర్ స్టారా … మజాకా …
హైదరాబాద్ : పవన్ కళ్యాన్ హీరోగా నటించిన కాటమరాయుడు సినిమా దూసుకుపోతోంది . కాటమరాయుడు సినిమా కు సంబందించిన టీజర్ ను ఇటీవల విడుదల చేసిన సంగతి తెలిసిందే . 'ఎంత మంది ఉన్నారన్నది ముఖ్యం కాదు.. ఎవడు ఉన్నాడన్నది ముఖ్యం' అంటూ పవన్ చెప్తున్న డైలాగ్ తో విడుదల

హైదరాబాద్ : పవన్ కళ్యాన్ హీరోగా నటించిన కాటమరాయుడు సినిమా దూసుకుపోతోంది . కాటమరాయుడు సినిమా కు సంబందించిన టీజర్ ను ఇటీవల విడుదల చేసిన సంగతి తెలిసిందే . ‘ఎంత మంది ఉన్నారన్నది ముఖ్యం కాదు.. ఎవడు ఉన్నాడన్నది ముఖ్యం’ అంటూ పవన్ చెప్తున్న డైలాగ్ తో విడుదల చేసిన ఈ టీజర్ ప్రభంజనంలా దూసుకుపోతంది. యూట్యూబ్ వ్యూస్ లో ఈ కాటమరాయుడు టీజర్ రికార్డ్ లు సృష్టిస్తోంది. విడుదలైన రెండు గంటల్లోనే మిలియన్ వ్యూస్ మార్క్ ను అందుకున్న కాటమరాయుడు, ఆ తరువాత మరికొన్ని గంటల్లోనే రెండు మిలయన్ల మార్క్ ను దాటేసింది. తొలి 24 గంటల్లో ఆల్ టైం రికార్డ్ ఖాయం అని అనుకున్న పవర్ స్టార్ ఫ్యాన్స్ నమ్మకాన్ని ఈ టీజర్ నిలబెట్టింది. పదిలక్షల హిట్స్‌ని వేగంగా సాధించిన తొలి తెలుగు చిత్రంగా రికార్డులు నెలకొల్పింది . తొలి 24 గంటల్లో 37 లక్షల మంది ఈ టీజర్‌ను చూసారు”అని చిత్ర యూనిట్ తమ సంతోషాన్ని తెలిపింది.ఈ టీజర్ కు ఒక్క రోజులో 1.4 లక్షల లైక్స్ రావడం కూడా రికార్డే. . పవన్ స్క్రీన్ పై కనిపించేది క్షణాలపాటే అయినా.. మెస్మరైజ్ చేసి పారేశాడు పవన్ కళ్యాణ్ అని అభిమానులు తబ్బిబ్బవుతున్నారు .