Home / Andhrapradesh  / ఎక్కడికక్కడే యువత అరెస్ట్ – ఆర్కే బీచ్ ఉద్రిక్తం

ఎక్కడికక్కడే యువత అరెస్ట్ – ఆర్కే బీచ్ ఉద్రిక్తం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో ప్రత్యేక హోదా కల్పించాలని చేపట్టిన ఆందోళన తీవ్ర రూపం దాల్చుతోంది . ప్రత్యేకంగా ఆ రాష్ట్రానికి చెందిన యువత చేపట్టిన ఈ కార్యక్రమం అక్కడి ఆర్కే బీచ్ లో కొనదాగుతోంది . యువత చేపట్టిన ఈ నిరసన కార్యక్రమం నేపథ్యం లో నగరమంతా పోలీసుల


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో ప్రత్యేక హోదా కల్పించాలని చేపట్టిన ఆందోళన తీవ్ర రూపం దాల్చుతోంది . ప్రత్యేకంగా ఆ రాష్ట్రానికి చెందిన యువత చేపట్టిన ఈ కార్యక్రమం అక్కడి ఆర్కే బీచ్ లో కొనదాగుతోంది . యువత చేపట్టిన ఈ నిరసన కార్యక్రమం నేపథ్యం లో నగరమంతా పోలీసుల మోహరింపు లతో నిండిపోయింది . ప్రస్తుతం యువతతో ఆర్కే బీచ్ మౌన దీక్షతో నిండి పోయింది . ఆ ప్రాంతం అంతా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.పోలీసులు ప్రజలు, యువకులు బీచ్‌కు రాకుండా అడ్డుకుంటున్నారు.

ఎక్కడికక్కడే అరెస్టులు

మౌన దీక్ష కోసం తరలివస్తున్న యువతను పోలీసులు ఎక్కడికక్కడే అడ్డుకుంటున్నారు.ఇప్పటికే మౌన దీక్ష కోసం వస్తున్న 30మంది యువతీయువకులను అరెస్ట్ చేసి న పోలీసులు వారిని పోలీస్ స్టేషన్లకు తరలించారు. టూరిస్టులను సైతం పోలీసులు ఆర్కే బీచ్‌కు వెళ్లకుండా అడ్డుకుంటున్నారు.ఈ పరిస్థుతుల నేపథ్యం లో వైయస్సార్ కాంగ్రెస్ నేత వంశీతోపాటు పలువురు నేతలు, కార్యకర్తలు కూడా పోలీసులు హౌజ్ అరెస్ట్ చేశారు. అలాగే స్థానిక గాంధీ విగ్రహం వద్ద నల్లబ్యాడ్జీలతో పలువురు యువకులు నిరసన తెలిపారు.ఇది ఇలా ఉండగా, విజయవాడ కృష్ణ లంక పోలీస్ స్టేషన్ ముందు జనసేన పార్టీ కార్యకర్తలు నిరసన చేపట్టారు.తిరుపతిలో కూడా యువత చేస్తున్న నిరసన ప్రదర్శనను పోలీసులు అడ్డుకున్నారు. ఎస్వీ వర్సిటీలో పరిపాలన భవనం ముందు నిరసన చేపట్టారు.

dailyenewz.updates@gmail.com

Review overview
NO COMMENTS

POST A COMMENT