Home / Crime  / భార్యను తుపాకీతో కాల్చిన దుబ్బాక ఎస్‌ఐ

భార్యను తుపాకీతో కాల్చిన దుబ్బాక ఎస్‌ఐ

తెలంగాణలోని సిద్ధిపేట జిల్లా దుబ్బాకలో శుక్రవారం దారుణం జరిగింది. దుబ్బాక ఎస్‌ఐ చిట్టిబాబు తన సర్వీస్‌ రివాల్వర్‌ తో భార్యను కాల్చి, తాను కూడా కాల్చుకున్నారు. దీంతో భార్య అక్కడికక్కడే మృతి చెందగా, చిట్టిబాబుకి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం చిట్టిబాబు పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. చిట్టిబాబు

తెలంగాణలోని సిద్ధిపేట జిల్లా దుబ్బాకలో శుక్రవారం దారుణం జరిగింది. దుబ్బాక ఎస్‌ఐ చిట్టిబాబు తన సర్వీస్‌ రివాల్వర్‌ తో భార్యను కాల్చి, తాను కూడా కాల్చుకున్నారు. దీంతో భార్య అక్కడికక్కడే మృతి చెందగా, చిట్టిబాబుకి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం చిట్టిబాబు పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. చిట్టిబాబు దంపతులకు కూతురు, కొడుకు ఉన్నారు. అయితే భార్యాభర్తల మధ్య మనస్పర్థలే కాల్పులకు కారణమా అనే అనుమానాలు ఉన్నాయి, అయితే, కుటుంబసభ్యులు మాత్రం ఉన్నతాధికారుల వేధింపులవల్లే ఎస్ ఐ చిట్టిబాబు ఈ దారుణానికి పాల్పడ్డాడని ఆరోపిస్తున్నారు. దుబ్బాకలో పనిచేస్తున్న చిట్టిబాబును ఇటీవలే డిప్యూటేషన్‌ మీద సిద్ధిపేటకు పంపించారు.

dailyenewz.updates@gmail.com

Review overview
NO COMMENTS

POST A COMMENT