Home / Latest News  / మూడు వేల కోట్ల డిజిటల్ చెల్లింపులు – సాధ్యమా ?

మూడు వేల కోట్ల డిజిటల్ చెల్లింపులు – సాధ్యమా ?

న్యూఢిల్లీ:నోట్ల రద్దు సందర్భం లో ఏర్పాటు చేసిన కమిటీ ఈ రోజు భారత ప్రధాన మంత్రికి తమ నివేదికను సమర్పించింది . నోట్ల రద్దు తదనంతర పరిణామాలు, డిజిటల్ పేమెంట్స్ పైన అధ్యయనం చేసి తగిన సలహాలు సూచనలు ఇచ్చేందుకు కేంద్రం ఏర్పాటు చేసిన చంద్రబాబు

న్యూఢిల్లీ:నోట్ల రద్దు సందర్భం లో ఏర్పాటు చేసిన కమిటీ ఈ రోజు భారత ప్రధాన మంత్రికి తమ నివేదికను సమర్పించింది .
నోట్ల రద్దు తదనంతర పరిణామాలు, డిజిటల్ పేమెంట్స్ పైన అధ్యయనం చేసి తగిన సలహాలు సూచనలు ఇచ్చేందుకు కేంద్రం ఏర్పాటు చేసిన చంద్రబాబు నాయుడు బృందం తమ మధ్యంతర నివేదికను ప్రధాని మోడీకి సమర్పించింది.ఏపీ సీఎం చంద్రబాబు నేతృత్వంలో ఈ బృందం సౌత్ బ్లాక్‌లో మోడీని కలిసి నివేదికను సమర్పించింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిశివరాజ్ సింగ్ చౌహాన్, నీతి ఆయోగ్ వైస్ చైర్మెన్ అరవింద్ పనగరియా తదితరులు మోడీని కలిశారు.ఈ కమిటీ ప్రధానికి పదకొండు పేజీలతో కూడిన నివేదికను సమర్పించింది. డిజిటల్‌ చెల్లింపుల ప్రోత్సాహానికి 20 సూచనలు చేసింది. డిసెంబర్‌ నాటికి 3వేల కోట్ల డిజిటల్‌ చెల్లింపులు జరిగేలా చూడాలని కమిటీ సూచించింది.

dailyenewz.updates@gmail.com

Review overview
NO COMMENTS

POST A COMMENT