Home / Hot Hot  / కాలుతున్నా కడసారిగా నీ పై కవిత రాతునూ

కాలుతున్నా కడసారిగా నీ పై కవిత రాతునూ

చితి పై కూడా శృతి చేస్తూ నిన్ను తలుతునూ ప్రేమ అనే పదం ఒక అద్భుతం , ప్రేమించడం , ప్రేమించబడడం అనేవి సృష్టిలో ఎప్పటికీ తరిగి పోని తీపి గురుతులు . అందుకే ప్రతి యువతీ , యువకులు ప్రేమలో ఓలలాడి తమ తమ అనుబంధాలని సార్ధకం చేసుకుంటున్నారు

చితి పై కూడా శృతి చేస్తూ నిన్ను తలుతునూ

ప్రేమ అనే పదం ఒక అద్భుతం , ప్రేమించడం , ప్రేమించబడడం అనేవి సృష్టిలో ఎప్పటికీ తరిగి పోని తీపి గురుతులు . అందుకే ప్రతి యువతీ , యువకులు ప్రేమలో ఓలలాడి తమ తమ అనుబంధాలని సార్ధకం చేసుకుంటున్నారు . ఈ కారణం చేతనే మనకు ప్రేమికుల రోజును ప్రపంచం మన ముందుకు తెచ్చింది . అయితే ఇది ప్రేమ అని కుర్రకారు చేపుతున్ద్తే , అది ప్రేమ కాదు వయసులో ఉన్న మైకం మాత్రమె అని మరో వర్గం  వాదిస్తోంది . అయితే ఏది ఏమైనా ఈ రోజు మన ముందుకు ప్రేమికుల రోజు వచ్చేసింది . ఇంత ప్రాముఖ్యతను సంతరించుకున్న ఈ ప్రేమికుల రోజు గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం .

‘ అసలీ వేలెంటైనూ మనోడు కాదు, వేలెంటైన్స్ డే కూడా మనది కాదు ,..పాశ్చత్య సంస్కృతికి పైత్యపు పోకడ లెందుకర్రా’ అని ఒక వర్గం వారు గగ్గోలు పెడుతూనే ఉన్నారు . అయినా ‘మీ రోజుల్లో ఈ వేలెంటైన్స్ డేలు లెవ్వనే కదా మీ అక్కసు!’ అని ప్రేమికుల రోజును సమర్దించే వారు వాదిస్తున్నారు .
వేలెంటైన్ అనే వ్యక్తి మూడవ శతాబ్దికి చెందిన రోమ్ నగర వాసి !అప్పటి చక్రవర్తి క్లాడియుస్ -2 పెళ్ళిళ్ళయిన వారు
సమర్ధవంతమైన సైనికులు గా రానించలేరని భావించేవాడు . దీంతో సదరు రాజు యువకుల వివాహాన్ని రద్దు చేసాడు .దీన్ని ఎదురించిన వాడే వేలెంటైన్ ! ఇది చాలా అన్యాయమని ప్రకటించి రహస్యంగా ప్రేమికులకి వివాహాలు జరిపించాడు . విషయం తెలుసుకున్న చక్రవర్తి వేలెంటైన్ కి మరణ శిక్ష .ఫిబ్రవరి -14 న విధించాడు. ఆ రకంగా వేలెంటైన్ ప్రేమికులకి హీరో అయ్యాడు ! ఆ తేది ప్రపంచానికి వేలెంటైన్స్ డే అయింది !ఇదీ పాపులర్ అయిన ఒక కథనం .ఇంకా రక రకాల కథనాలు ప్రాచుర్యం లో వున్నాయి .
మనసు లోని ప్రేమని ఎలాగైనా వ్యక్త పరచాలని కొటేషన్ల కోసం వెదికే ప్రేమికులూ , రూపాయ్ కొచ్చే గులాబీని వంద రూపాయలకైనా కొనేసే ప్రేమికులూ , ఎలాంటి గిఫ్ట్ నిచ్చి సంతోష పెట్టాలా అని ఆరాటపడే ప్రేమికులూ,..మీ కోసం www.telugunewstoday.com ప్రత్యేకంగా సమర్పిస్తోంది !

వేలెంటైన్స్-డే (ప్రేమికుల రోజు ) కొటేషన్లు :

*భాషలో ఎన్ని అక్షరాలూ ఉన్నా నా ప్రేమను వ్యక్తం చేయడానికి సరిపోవటం లేదు .
*నీ వల్లే నేను దొంగను అయ్యాను – ఎందుకంటే నీ హృదయాన్ని దొంగి లించి నా గుండెల్లో దాచుకున్నా .

*ప్రేమ చిగురేప్పుడు నీవు హాయ్ అని చెప్పినా .. చివరికి తెగిపోయినప్పుడు బాయ్ చెప్పినా నీ ప్రేమైతే నా గుండెలో చెదరడం లేదు

*ప్రేమించానని చెప్పేప్పుడు తడుముకున్నది _ ప్రాణం పోయేవరకు నీతో ఉంటాననికేనని చెప్పమన్నది .

*నీ పరిచయానికి ముందు నా జీవితం ఓ గాలి పటం – ఇప్పుడది నీ చుట్టూ తిరిగే విసిరేసిన బొంగరం .

* తీయటి ఒక పదం కోసం ప్రపంచం అంతా వెతికా – ఈ రోజే తెలిసింది నీ పేరే ఆ పదమని నా మది మురిసింది .

* ప్రపంచం అంతా ఒక వ్యక్తిగా కనిపి స్తుంది ఎందుకని డాక్టర్ దగ్గరికి వెళ్ళా – నీ ప్రేమలోంచి బయటకు వస్తే ప్రపంచం కనిపిస్తుందని చెప్పాడు , అది సాధ్యమా ప్రియా ?

* చితి పై కూడా శృతి చేస్తూ నిన్ను తలుతునూ _ కాలుతున్నా కడసారిగా నీ పై కవిత రాతునూ

* నిన్ను ప్రేమించినప్పుడు తెలియలేదు – ఈ గాయానికి మందు లేదని

* ప్రేమకు నిజం , అబద్దం ఉండదు – గాలికి , నీరుకు , నిప్పుకు మల్లె

ఫ్రెండ్స్ ప్రేమకు నిర్వచనం వెతకకండి . నిజాయితీగా ప్రేమించడం మాత్రమె గుండెల్లో దాచుకోండి.

—-కళ్యాణం శ్రీనివాస్

dailyenewz.updates@gmail.com

Review overview
NO COMMENTS

POST A COMMENT